Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- వికారాబాద్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- వికారాబాద్ రూరల్
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులపై ముఖ్యంగా పాల ఉత్పత్తులపై జీఎస్టి విధించడం సరికాదని దీనిని కేం ద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వికారాబాద్ ఎమ్మె ల్యే టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతు కు ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ నిత్యావసర సరుకులపై జీఎస్టి విధించడాన్ని, పన్ను శాతా న్ని పెంచడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రధాన కూడలి వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.