Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కుల్కచర్ల
మండల కేంద్రంతో పాటు కాముని పల్లి, ఇప్పాయి పల్లి, పుట్టపహడ్, చాపల గూడెం, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో ఆషాఢ మాసం చివరి శుక్రవావాన్ని పురస్కరిం చుకొని గ్రామ దేవత పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో శివసతుల పూన కాలు పోతురాజుల విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాలు ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు యువజన సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.