Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్
నవతెలంగాణ-కొడంగల్
ప్రస్తుత సీజన్లో గొర్రెల్లో సోకే నీలి నాలుక వ్యాధి వ్యాప్తి సకాలంలో గుర్తించకుంటే అనర్థం జరిగే అవకాశం ముందని చికిత్స కంటే నివారణ చర్యలే కీలకమని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం నీటూరు గ్రామంలో 428 గొర్రెలకు నీలి నాలుక ఉచిత టీకాలు వేశారు. జిల్లా పశు వైద్యాధికారి ఉచిత నీలి నాలుక టీకాల కార్యక్రమాన్ని పర్య వేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలి నాలుక వ్యాధి రావడం వల్ల మేత మేయక, నీరు తాగక ని రసించి చనిపోయే ప్రమాదముందన్నారు. వ్యాధి పట్ల అప్ర మత్తమై నివారణ చర్యలు చేపడితే గొర్రెలను ప్రాణ నష్టం నుంచి కాపాడుకోవచ్చన్నారు. గ్రామంలోని ప్రతి గొర్రెల న్నింటికీ నీలి నాలుక వ్యాధి టీకాలు వేయించాలన్నారు. కా ర్యక్రమంలో డాక్టర్ జి. వరలక్ష్మి, జేవిఓ అన్వర్, విఏ. సాయి బాబు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, జహీర్ ఖాన్, అనిత తదితరులు పాల్గొన్నారు.