Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకస్మికంగా ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
నవతెలంగాణ- మోమిన్పేట్
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యురాలి గైర్హాజరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది పని విధానా లను, రిజిస్టర్లను పరిశీలించారు. మూడు రోజులుగా ఎలాంటి అనుమతీ లేకుండా గైర్హాజరు అవుతూ..ఖాళీగా ఉన్న రిజిస్టర్ను చూసి వాపోయారు. సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉండటం తగదని, వికారాబాద్ జిల్లా వైద్య అధికారి గారితో ఫోన్లో మాట్లాడి పనిచేయని వైద్యురాలిపై చర్య తీసుకో వాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మందులను పరిశీలించా రు. వర్షాకాలం సందర్భంగా వాతావరణం మార్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవసరమైన మం దులను అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశిం చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్, నాయకులు బిచ్చన్న, మణెయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.