Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుతో జీవితాల్లో వెలుగులు నింపుతుందని, విడతల వారీగా దళితబంధు ద్వారా ఆర్థిక సాయం ఉంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అయినాపుర్ గ్రా మంలో దళిత బంధు కింద లబ్దిపొందిన వారి కిరాణ దుకా ణం, కాంక్రిట్ యంత్రంలను ఎమ్మెల్యే ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం దళి తుల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని తెలిపారు. లబ్ది దారులు అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాలకూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దళితుల కష్టాలని తీర్చివారి జీవితాల్లో వెలుగు తీసు కువచ్చే సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన విప్లవాత్మక దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నిం పుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కే.నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచుల సంఘం అధ్యక్షులు కె.రా జిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, టీఆర్ఎస్ దోమ, పరిగి అధ్యక్షులు గోపాల్ గౌడ్, ఆంజనేయులు, పార్టీ ప్రధా న కార్యదర్శి కష్ణరెడ్డి, అయినాపూర్ టీఆర్ఎస్ నాయకులు రుక్మయ్య గౌడ్, వెంకటేష్ గౌడ్, గార్లపలి వెంకటయ్య, మా జీ ఉప సర్పంచ్ వెంకటయ్య, బాలయ్య, బొంపల్లి ఉప సర్పంచ్ రఫిక్, గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.