Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీ విజయలక్ష్మి
నవతెలంగాణ-మర్పల్లి
వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధులనుండి పశువులను కాపాడుకోవాలని మండల పశువైద్యాధికారి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని భూచన్ పల్లి గ్రామంలో పశువైద్య క్యాంపు నిర్వహించి పశువులకు ప్రాణాంతకమైన నీలి నాలుక వ్యాధి వ్యాక్సిన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు వర్షాకాలంలో తమ మేకలు గొర్రెలకు తప్పనిసరిగా పశు వైద్య అధికారుల సూచనలు సలహాల మేరకు మందులు వాడుతూ తమ విలువైన పశువులను కాపాడుకోవాలన్నారు. ముం దస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే పశువులు ప్రాణాంతకమైన వ్యాధులతో ప్రాణాలు కోల్పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.