Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వైద్యాధికారి మునీబ్
నవతెలంగాణ-దోమ
క్షయ వ్యాధి నియంత్రణకు కృషిచేయాలని, వచ్చే 20 25 నాటికి టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు మండల వైద్యాధికారి మునీబ్ అన్నారు. శుక్ర వారం మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో టీబీ క్యాంప్‌ను వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసి గ్రామస్తులకు రక్త పరీక్షలు చేశామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ టీబీతో ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తున్నారని, ప్రజల్లో ఆ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడమే కారణ మన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, తెమడ సాయం త్రం జ్వరం రావడం, ఆకలి, బరువు తగ్గడం వంటి లక్షణా లు కనిపిస్తే వెంటనే దవాఖానల్లో పరీక్షలు చేయించుకో వాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచి తంగా మందులను సరఫరా చేయడంతో పాటు ప్రతినెలా పౌష్టికాహారం తీసుకునేందుకు రూ.500 పంపిణీ చేస్తున్న దని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులు 8.7.మిలియన్లు ఉంటే, ఒక్క భారతదేశంలోనే ఈ సంఖ్య 2.0 మిలియన్లుగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దేశం లో టీబిని నియంత్రిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిని ని ర్మూలించినట్లు అవుతుందన్నారు. సరైన చికిత్స తీసుకుంటే టీబి వ్యాధి నయం అవుతుందని, వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాటిల్లే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.