Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్ రాజు, ఈశ్వర్ నాయక్
నవతెలంగాణ-షాద్నగర్
నేడు జరిగే వీఆర్ఏల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమా న్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎన్ రాజు, ఈశ్వర్ నాయక్ అన్నారు. షాద్నగర్ ఆర్డీఓ కా ర్యాలయ ఆవరణలో జరుగుతున్న వీఆర్ఏల సమ్మె మూడో రోజుకు చేరిన సందర్భంగా సీఐటీయూ నాయకులు సమ్మె లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం ప్రవేశ పెడుతున్న సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేస్తామని చెప్పారన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, 55 ఏండ్లు దాటిన వీఆర్ఏల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఖాళీగా ఏర్పడ్డ వీఆర్ఏల స్థానంలో కారణ్య నియామకాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారన్నారు. అంతే కాకుండా అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పి స్తామని చెప్పారని కానీ నేటికీ అమలు జరగలేదని కాబట్టే వీఆర్ఏలు అందరూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నార న్నారు. నూతన రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వీఆర్ఏలకు అనేక సమస్యలు వచ్చి పడ్డాయని వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తర్వాత అన్ని పను లు వీఆర్ఏలు మాత్రమే చేస్తున్నారని, వీఆర్ఏలపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏ సమస్యలు పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు పో రాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు దత్తాత్రేయ, కొత్తూరు మండల అధ్యక్షులు హరినాథ్, కేశంపేట మండల అధ్యక్షలు గోపాల్, నందిగామ మండల అధ్యక్షలు కష్ణయ్య, చౌదరి గూడ మండల అధ్యక్షలు బ్రహ్మయ్య, కొందుర్గు మండల అధ్యక్షలు బాలాంజనేయులు పాల్గొన్నారు.