Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
ఇంజనీరింగ్ విభాగాల్లో మంజూరి అయిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్పరెన్స్ హాల్లో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో జిల్లాలో మంజూరైన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పనులు గ్రౌండింగ్ అయి పూర్తికాని పనులు పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకొని సంబంధిత ఇంజనీర్లు సమీక్షల నిర్వ హించుకొని పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. తక్కువ వ్యయంతో కూడిన పనులను గుర్తించి సత్వరమే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. జిల్లాలో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన కమ్యూనిటీ భవనాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవా లని గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరిస్తూనే భవనాల పనులను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆర్అండ్బి, పంచాయతీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్ల మరమ్మతులతో పాటు రోడ్లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకో వాలని సంబంధిత అధికా రులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో రూర్బన్ కింద చేపట్టిన పనులను త్వరలో పూర్త య్యలా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఓను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీ లాడ్స్ కింద మంజూరైన పనులను శాఖల వారీగా జాబితాలను రూపొందిం చాలని ఇప్పటికే గ్రౌండింగ్ కానీ పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను నివేదికలను పంపాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీవోల పరిధిలో ఉన్న పనులను కూడా పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డబుల్ బెడ్ రూ మ్ పథకం కింద నిర్మాణాలు చేపడుతున్న వాటిపై కలెక్టర్ మాట్లాడు తూ ఇప్పటికే పనులు పూర్తి దశలో ఉన్న వాటిలో విద్యుత్తు, నీటి సరఫరా, ప్లాస్టరింగ్ పనులను త్వరిత కట్టిన పూర్తి చేసిన చర్యలు తీసుకోవాలన్నారు. 'మన ఊరు మనబడి' కార్యక్రమం కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను వంద శాతం చేపట్టాలని కలెక్టర్ తె లిపారు. వంటగది, పహరీ, టాయిలెట్స్ సంబంధించి అం చనాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడానికి వీలుగారెండు రో జుల పాటు(శని,ఆదివారాలు) కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్లను హాజరు పరిచి వారం రోజుల్లోగా పనులు పూ ర్తిచేయాలన్నారు. సమీక్షా సమావేశంలో ఇన్చార్జ్ డిఆర్ఓ విజ యకుమారి, డిఆర్డిఓ కృష్ణన్, సీపీఓ నిరంజన్ రావు, పం చాయత్ రాజ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బి ఈఈ లాల్ సింగ్, ఇరిగేషన్ఈఈ సుందర్‌లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.