Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలోనే తాండూరు
అభివృద్ధి సాధ్యం
- బీసీ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ రెండున్నరేండ్ల ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాలని బీసీ నాయకులు శుక్రవారం పట్టణ కేంద్రంలోని శ్రీ దుర్గా గ్రాండియర్ హౌ టల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, ము న్సి పల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పద్దోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వివిధ టీిఆర్‌ఎస్ మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ ఒప్పం దం ప్రకారం రెండున్నరేండ్ల తర్వాత రాజీ నామా చేస్తా నని ఒప్పందానికి కట్టుబడి ఉండాలని, ఒప్పం దం ప్రకారం రాజీనామా చేయకుంటే ఇంటి ముందు ధర్నా చేస్తామ న్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుకు తమ మద్దతు పూర్తిగా ఉం టుంద న్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో చైర్ పర్సన్ పీఠం పై చైర్‌ర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పదోళ్ల దీపా నర్సింలు మధ్య జరిగిన ఒప్పంద గడువు ఈనెల 26 తో ముగిసిపోతుందని గుర్తుచేశారు. మంత్రులు, పార్టీ నేత ల సమక్షంలో రెండున్నరేండ్ల ఒప్పందానికి కట్టుబడి పదవి నుంచి దిగిపోవా లన్నారు. చైర్ పర్సన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపా నర్సింలుకు అవకాశం కల్పించాలన్నారు. లే దంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చ రించారు. మున్సిపల్ కార్యాలయం, చైర్ పర్సన్ ని వాసం ముందు ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. తాం డూరు నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తోనే సాధ్యమన్నారు. మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బొమ్మలాగా మారిపోయారని, ఆమె పరిపాలన అస్తవ్యస్తం గా మారిం దని విమర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ఎర్రం వసంత, సందులలత గౌడ్, తాం డూరు పార్టీ అధ్యక్షులు రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కొహిర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు శ్రీని వాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిగౌడ్, కార్మిక విభా గం అధ్యక్షులు కె.గోపాల్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ ఉప్పరి మహేందర్, టీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్. సీనియర్ నాయకులు పాండు, యాలాల వైస్ ఎంపీ పీ రమేష్, రాములు, తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, కరణ్ కోట్ ఉపసర్పంచ్ హే మంత్ కుమార్, తాండూరు నాయకులు చెన్ బసప్ప, నరేం దర్ గౌడ్, యువ నాయకులు చంటియాదవ్, ఇంతి యాజ్, టైలర్ రమేష్, పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.