Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
- ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ
నవతెలంగాణ-శంకరపల్లి
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం శంకరపల్లి మండలంలోని మిర్జాగుడ గ్రామంలోని పద్మ రవిందర్‌గౌడ్ ఫంక్షన్హల్లో మిర్జాగు డ, జన్వాడ గ్రామాల లబ్దిదారులకు ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇంటికి ఒక పెద్ద కొడుకుల ప్రతి ఇంటికీ ఎదో ఒక సంక్షేమ పథకం అందిం చి దేశంలోనే ఆదర్శంగా నిలిపారని అన్నారు. భారతదేశం లోని 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న కేవలం రూ. 600 పింఛన్ మాత్రమే ఇస్తుందన్నారు. కానీ రాష్ట్రంలో రూ. 2వేలు, వికలాంగులకు రూ.3వేలు ఇస్తున్నామని తెలిపారు. ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొవిందమ్మ గోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకయ్య జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్, జన్వాడ సర్పంచ్ లలిత నరసింహ, ఈఓ పీఆర్డీ, గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, రాయదుర్గం సొసైటీ చెర్మన్ అరవింద్‌రెడ్డి, జ న్వాడ ఎంపీటీసీ తలారి నాగేందర్, జన్వాడ ఉప సర్పంచ్ శ్రీలత రాములు, మాజీ ఎంపీటీసీ మల్లేష్‌గౌడ్, వార్డు సభ్యులు పి.సురేందర్‌రెడ్డి, వై. ప్రవీణ్ కుమార్, మోత్కు పల్లి రాధిక అశోక్, గౌడి చర్ల వెంకటేష్, సీనియర్ నాయ కులు కురుమ వెంకటేష్, ద్రోణాచారి, గ్రామ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.