Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకులంల్లో వైద్య శిబిరం
- పరీక్షలు, మందులందజేత
- ప్రిన్సిపాల్ కృపవరం, కౌన్సిలర్ పత్తి ప్రవీణ్
నవతెలంగాణ-గండిపేట్
సీజపల్ వ్యాధుల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని గురుకుల ప్రిన్సిపాల్ కృప వరం, కౌన్సిలర్ పత్తి ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం నార్సింగి మున్సి పాలిటీలోని 8 వార్డుల్లో నార్సింగి ప్రభుత్వ వైద్యధికారి డాక్టర్ పద్మా ఆధ్వర్యం లో సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థునీలకు ఉచిత వైద్య క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్, కౌన్సిలర్ ముఖ్యులుగా పాల్గొన్న వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతవరణం కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. చిన్నారులు, బాలిక లు వ్యాధుల రాకుండ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఎప్పటిక ప్పుడు అంటు రోగాల పట్ల జాగ్రతలు తీసుకోవాలన్నారు. కోవిడ్ టెస్టులతో పాటు, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి కోవిడ్ కేసులు లేవన్నారు. సీజ నల్ వ్యాధుల వచ్చిన బాలికలకు ఉచితంగా మందులను అందజేశారు. హౌస్ మా స్టర్స్, క్లాస్ టీచర్లు విద్యార్థునీల పట్ల ఆప్రమత్తంగా ఉండాలన్నారు. విద్య తో పాటు ఆరోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో స్టాప్ నర్సు విక్టోరియా, నార్సింగి ఎఎన్ఎంలు తేజా, జయ, రేణుఖా, అశ వర్కర్లు శంకరమ్మ, అరుణ, లతా, ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.