Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైవేట్ స్కూల్ బస్సు ఢకొీని ఇద్దరు చిన్నారుల మృతి
- ఇద్దరు బిహార్‌కు చెందిన వలస కార్మికుల పిల్లలు
- శేరిగూడలో ఈ దుర్ఘటన
- రోడ్డుపై బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల ఆందోళన
- ఏసీపీ ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
- ప్రైవేటు స్కూల్ యాజమాన్యంతో చర్చలు
- బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం హామీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పొట్టకూటి కోసం వలసొచ్చిన కుటుంబాలను ప్రైవేటు పాఠశాల బస్సు రూపంలో చిదిమేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. 12ఏండ్లలోపు బాలిక అక్కడిక్కకడే మృతి చెందగా, తీవ్ర గాయా ల పాలైన బాలుడు నిలోఫర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అందుకు నిరసనగా వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. సు మారు గంటన్నర సేపు రవాణ స్థంబించింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాఠశాల యాజమాన్యం ప్రకటించిం ది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడలో మంగళ వారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు. బీహార్ రాష్ట్రం, బ ేగుసరాగ్ జిల్లా కద్రబాద్కు చెందిన సుమారు 200 వసల కార్మికులు శేరిగూ డలోని ఓ ప్రయివేటు బాయిల్డ్ రైస్‌మిల్లులో పనులు చేస్తున్నారు. వారిలో సేదీ, షీలాదేవి అనే దంపుతులకు చెందిన కాజ్కుమారి(12), సుశీల్పటేల్, చింతా దేవికి చెందిన అభిషేక్(8) చిన్నారులు సమీపంలోని ప్రభుత్వపాఠశాలలో చదువు కుంటున్నారు. కాగా మంగళవారం ఉదయం రోడ్డు వెంట నడుచుకుంటూ కిరా ణా షాప్‌కి వెళ్తున్నారు. కాగా, ఇబ్రహీంపట్నం ఆంగ్లీష్ట్ పాఠశాలకు చెందిన బస్సు శేరిగూడలో పాఠశాల విద్యార్థులను ఎక్కించుకుని డివైడర్ వద్ద ఇబ్రహీంపట్నం వైపు మళ్తుంది. వెనుక నుంచి ఒక్కసారిగా ఢ కొట్టింది. దాంతో కాజల్ అక్కడిక్కడే మృతి చెందింది. అభిషేక్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియాకు తరలిం చారు. అక్కడి నుంచి నిలోఫర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందా డు. విషయం తెలుసుకున్న మతుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా సంఘటన స్థలానికి తరలివచ్చారు. బస్సును అడ్డుకున్నారు. రోడ్డుపై బేటాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటన్నర సేపు రవాణా స్థంబించింది. తమకు న్యా యం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. బస్సులను అడ్డుకుని దాడులు చేసే ప్రయత్నం చేశారు. దాంతో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఆధ్వర్యంలో వారిని చెదరగొట్టారు. మృత దేహాలకు పోస్టు మార్టం నిర్వహించి బంధువు లకు అప్పగిం చారు. కాగా, పలువురు పెద్దలు కూర్చుని ప్రమాదానికి కారణమైన పాఠశాల యాజమాన్యం నుంచి బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించేందుకు చర్చలు జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీం పట్నం సీఐ సైదులు తెలిపారు.