Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి రాని కలెక్టరేట్ కార్యాలయం
- ఇంకా సామాగ్రిని తరలిస్తున్న శాఖలు
- వచ్చిన శాఖలకు ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు
- సాకుతో సేవలకు విరామం ప్రకటించిన అధికారులు
- పార్టిషియన్లు కరువు.... ఫర్నిచర్ లేదు
- ఇంకా పూర్తి స్థాయిలో సేవలకు దూరం
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రతినిధి
ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. హైదరాబాదులోనే ఉంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంకా నూతన కలెక్టరేట్ నుంచి సేవలు అందుబాటులోకి రావడం లేదు. గత నెల 25 నుంచి ఇంకా సామాగ్రిని తరలిస్తున్న శాఖలునేకం ఉన్నాయి. అయినా వచ్చిన శాఖలకు ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సాకుతో సేవలకు విరా మం ప్రకటిస్తున్నారు. ఇంకా సమయం పడుతుందని ప్రజలను వెనక్కి పంపి స్తున్నారు. ఆయా క్యాబిన్లలో పార్టిషియన్లు కరువయ్యాయి. ఫర్నిచర్ లేదు. దాం తో నూతన సమీకృత కలెక్టరేట్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో సేవలకు దూరం గానే ఉంటున్నాయి.
పౌరులకు అందని సేవలు..
అదునాతన వసతులతో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సేవ లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రజల తాకిడి ఆరంభమైనాప్పటికీ ఇంకా వారికి సేవలు అందడం లేదు. ఇంకా పర్మిచర్ తరలింపులోనే ఆయా శాఖలు నిమగమయ్యాయి. శాఖలకు అనుగుణంగా కార్యాలయాలను కేటాయించిన అందులో జిల్లా అధికారులకు, ఇతర సిబ్బందికి పార్టీషియన్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని శాఖల కార్యాయాల్లో ఇప్పుడు ఫర్నిచర్ పనులు సాగుతుండగా చాలా శాఖలలో పాత కార్యాలయం నుంచి తీసుకువచ్చిన కుర్చీలు, టెబుళ్లను సర్దుకుంటున్నారు. పాత కలెక్టరేట్ నుంచి తీసుకువచ్చిన సామాగ్రిని ఆయా శాఖల కార్యాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో చాలా శాఖల కార్యాలయాలు
ఇంటర్నెట్ లేదంటు.....
నూతన కలెక్టరేట్‌ని రెవెన్యూతో పాటు కొన్ని శాఖల్లో ప్రైవేట్ ఇంటర్నెట్ పెట్టుకుని సిబ్బంది పనులు నిర్వహిస్తుండగా మెజార్టీ శాఖలలో సిబ్బంది కాలక్షేపం చేస్తున్నారు. పనుల మీద ఏ శాఖకు వెళ్లిన ఇంటర్నెట్ సౌకర్యం లేదని ప్రజలకు చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లా కార్యాలయాల్లో శాఖల ఫ్యాన్లు లేకపోవడంతో చాలా కార్యాలయాల్లో గుంపులు గుంపులుగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవారు అధికంగా కనిపించగా కొన్ని శాఖలలో సెల్ఫోన్లలో నమగమయ్యారు.
20 రోజులైనా..
రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను గత నెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భవనం ప్రారంబోత్సవం చేశారు. అయితే గత నెల 29 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు సమీకృత కలెక్టరేట్‌కు తరలిరావాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇంత వరకు అన్ని శాఖలు ఇక కొత్త కలెక్టరేట్ నుంచి పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన దరిమిలా ఆయా శాఖల ఉన్నతాధికారులు నూతన కలెక్టరేట్లో రిపోర్ట్ చేసి తాము వచ్చామని చెప్పుకున్నారు తప్ప తమ శాఖలను పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి విధులు నిర్వహించేలా చర్యలు మాత్రం చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌తో పాటూ, అదనపు కలెక్టర్లు, డీఆర్‌ఓతో పాటు రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడకు సామాగ్రీని తరలించింది. ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు. పలు శాఖల అధికారులు కేవలం తమకు కేటాయించిన కార్యాలయంలో పూజలు చేసి చేతులు దులుపుకోగా మరికొన్ని శాఖలు సామాగ్రి తరిలింపునకే పరిమితమయ్యారు.
నగరంలోనే కీలక శాఖలు..
జిల్లాలో కీలకమైన విద్యాశాఖ అధికారులు ఇప్పుడిప్పుడు సామాగ్రిని తరలిస్తున్నాయి. ప్రతినిత్యం వివాదాల్లో ఉండే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శివరాంపల్లి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. సమీకృత కలెక్టరేట్లో వారికి కేటాయించిన కార్యాలయంలో ఇద్దరు క్రింది స్థాయి సిబ్బందిని మాత్రమే కూర్చోపెట్టారు. వచ్చిన వాకబ్ చేసిన వారికి మాత్రం ఇంకా రాలేదని సమాధానం చెప్పి పంపిస్తున్నారు. డీసీఓ, డీటీఓ అధికారులు పూజలు నిర్వహించారు. ఇతర శాఖలు సామాగ్రిని సర్దుకుంటున్నారు. డీఏసీ, డీఆర్డీఓ, ఉద్యానవన, మైనింగ్, భూగర్భజలశాఖ, సంక్షేమ శాఖలతో పాటు పలు శాఖలు ఇక్కడకు పూర్తి స్థాయిలో చేరాయి. పొల్యూషన్ కంట్రోల్, డ్రగ్స్ కంట్రోల్ వంటి అనేక శాఖలు ఇప్పటి వరకు ఇటువైపు వచ్చిన దాఖలాలు లేవు.
పార్టిషియన్లు లేవు.... ఫర్నిచర్ కరువు..
ప్రభుత్వం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను తరలించినప్పటికీ ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఇంకా చిందరవందరగా రికార్డులను పడేశారు. ఒక్కొ శాఖకు కేటాయించిన గదులను ఇంకా పార్టిషియన్లు చేసుకోలేదు. దాంతో జిల్లా స్థాయి అధికారితోపాటూ, సిబ్బంది కూడా కుర్చీలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఫర్నిచర్ కూడా సరిగ్గాలేదు. కుర్చీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పార్టిషియన్ ఏర్పాటు చేసుకుని, ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలంటే మరో నెల రోజులైనా ముందుకు సాగే పరిస్థితి కన్పించడం లేదు.
పని చేయని ఇంటర్నెట్...
కమ్యూనికేషన్ పెరుగుతున్న తరుణంలో ఆయా ప్రభుత్వ శాఖలు పూర్తిగా ఇంటర్నెట్‌పైనే ఆధార పడి కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ తరుణంలో నూతన కలెక్టరేట్లో ఇంటర్నెట్ వసతి అందుబాటులోకి రాలేదు. దాంతో ఆయా శాఖల్లో విధులు స్థంభించాయి. పౌరులకు ఇంకా ఇంటర్నెట్ వసతి లేదని సాకు చూపుతూ పంపిస్తున్నారు. అధికారులు ఇంటర్నెట్ వసతిని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డీఆర్డీఏ వంటి శాఖలో ఉద్యోగులు తమ పనులు చేసుకోకపోతే పెండింగ్ పడే అవకాశం ఉండటంతో తమ సెల్ఫోన్లను కనెక్ట్ చేసుకుని పనులు చేసుకుంటున్నారు.