Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీవాసులు
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో స్వైరవిహారం చేస్తున్న పందులను అరికట్టాలని కోరుతూ మంగళవారం కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నివాసముంటున్న రెండు కుటుంబాల పందుల యజమా నులు నిత్యం స్థానిక ఫంక్షన్ హాల్లు, హౌటల్ల నుంచి మిగిలి పోయిన ఆహారాన్ని తెచ్చిపందుల కోసం వేస్తున్నారన్నారు. దీంతో కాలనీలో విచ్చలవిడిగా తిరుగుతున్న పందులతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలనీలో పందులను అరికట్టకుంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడ్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. దీంతో స్పందించిన చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ భీమనపల్లి దుర్గయ్య వారంరోజుల్లో పందుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ధర్నా ఆలోచనను విరమించుకున్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు విష్ణు చారి, వాటర్ బాబా, శ్రీను, యాదయ్య, ఆంజనేయులు, నిర్భల, మంజుల, విజయలక్ష్మి పాల్గొన్నారు.