Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ స్థాపించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల కోసం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అదే విధంగా తలకొండపల్లి మండలంలోని ఇస్రాయిపల్లి గ్రా మంలో 27 మంది నిరుపేద కుటుంబాల కోసం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామానికి చెందిన రాసులపల్లి శంకరయ్య, రాసులపల్లి వెంకటేష్ ఇంటి నిర్మాణానికి కా వలసిన సిమెంట్ ఇటుక ఇసుక తదితర వాటిని స్థానిక ఎంపీటీసీ సభ్యులు మల్కేడి అంబాజీ, ఉపసర్పంచ్ ఎంఏ అజీజ్ ఉప్పల ట్రస్ట్ ద్వారా సమకూర్చారు. ఈ సందర్భంగా ఇండ్ల లబ్దిదారులు లక్షల రూపాయలు వెచ్చించి తమలాం టి నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్న ఉప్పల వెంక టేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజు, వీ.రాజు, వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.