Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల కళాశాల వసతి గృహాన్ని సందర్శించడానికి వెళ్లిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను సుమారు 3 గంటలు బయట వేచి ఉన్నారు. దోమ కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో భోజ న సౌకర్యం మౌలిక వసతులు సరిగ్గా లేవని, వాటర్ ప్లాం ట్ పనిచేయడం లేదని అక్కడి విద్యార్థుల గోస ఎవరూ చూడట్లేదని గిరిజన విద్యార్థి దృష్టికి వచ్చింది. దీంతో రా థోడ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి సమస్య ఏంటని విద్యార్థులను అడిగి తెలుసుకోవడానికి ఆయనకు లోపలికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదని ప్రశ్నిస్తే జిల్లా డీఈఓ విద్యార్థి సంఘ నాయకులను లోప లికి రానివద్దన్నారని ఎస్ఓ మంగమ్మ తెలిపారు. పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి విద్యార్థుల జీవితాలతో చల గాట మాడుతున్నారని, తాను ఒక విద్యాధికారిని అని మ ర్చిపోయి రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నా రని ఆయన అన్నారు. డీఈఓ స్పందించి విద్యార్థి సంఘా న్ని అనుమతి ఇవ్వాలని లేని యెడల జిల్లాలో పెద్ద ఎ త్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని డీఇఓ కార్యాల యాన్ని ముట్టడిస్తామని జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీని వాస్ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం తాలూకా అధ్యక్షులు జే శ్రీను నాయక్, మండలాధ్యక్షులు సునీల్ నాయక్, తులసి రామ్ నాయక్ పాల్గొన్నారు.