Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ యువజన సంఘం
- అధ్యక్షుడు వగ్గు మహేష్
- రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం
నవతెలంగాణ-ఆమనగల్
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆమనగల్ అంబేద్కర్ యువ జన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నూతన పార్ల మెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వగ్గు మహేష్ స్వాగతిం చారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచం లోనే అతి పెద్దదైన దేశానికి అత్యున్నత ప్రజాస్వామ్య రూ పంగా ఉండే నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వా నికి అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఆయన విన్న వించారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వానికి మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి ఎనుముల రమేష్, ప్రచార కార్యదర్శి హఫీజ్, నాయకులు మల్లేష్, దర్శన్, శ్రీరామ్, ప్రవీణ్, శివ, నరేందర్, గోపి పాల్గొన్నారు.