Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రవీందర్
నవతెలంగాణ- నవాబుపేట్
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమాన్ని అరెస్టులతో ఆప లేరని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ని ముట్టడిస్తామని మండ లాధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు రాములు, రవీందర్ తెలిపా రు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీస్లు ఒక రోజు ముందునుండే ముందస్తు అరెస్ట్ చేయడం దు ర్మార్గమైన చర్య అని అన్నారు. వివిధ జిల్లాలలో ఉన్న వేలా ది మంది ఉపాధ్యాయులు 317, ద్వారా ఇబ్బందులకు గుర వుతున్నారు. దీనిలో రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికన చేయడం ద్వారా జూనియర్ ఉపాధ్యాయుల కు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లు నోచుకోకుండా సం వత్సరాలుగా ఎదురుచూస్తున్నారు.%CPS% ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు అభద్రత భావానికి గురవుతున్నా రని తెలిపారు. వారి పింఛన్ ఆసరా పింఛన్ కన్నా అద్వా న్నంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లే క, ఉపాధ్యాయులే, పాఠశాలను శుభ్రం చేసుకుంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వారే సొంత డబ్బుతో శుభ్రం చేయిం చుకుంటున్నారని, ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారంలో చిత్తశుద్ధి ఉంటే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ఆయా సంఘ నాయకులతో చర్చలు, సమస్యలు పరిష్క రిచాలని డిమాండు చేశారు.