Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ
- సభ్యులు బోడ సామెల్, రాజు
- తలకొండపల్లి నుంచి ఆమనగల్
- మీదుగా మాడ్గుల వెళ్ళిన బైక్ ర్యాలీ
నవతెలంగాణ-ఆమనగల్
రైతాంగ సాయుధ పోరాటంతో నిజాం సర్కారు తల వంచి తెలంగాణకు విముక్తి కలిగించినది కమ్యూనిస్టులే అని రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోడ సామెల్, రాజు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి సీపీఐ(ఎం) ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ 4వ రోజు మంగళవారం తలకొండపల్లి మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామంలో ప్రారంభమై ఆమనగల్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు బోడ సామెల్, రాజు తదితరులు మాట్లాడారు. నైజాం అండతో తెలంగాణలోని దొరలు, భూస్వాములు, దేశ్ము ఖ్ల అరాచకాలకు రైతాంగ సాయుధ పోరాటం చేస్తున్న 4,000 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు కోల్పోయి, రూ.50 వేల మంది జైలు పాలయి రూ.10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టినట్టు వారు గుర్తుచేశారు. అదేవిధంగా ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కౌలుదారి చట్టాన్ని తీసుకొచ్చి భూములు పంచిందన్నారు. నాడు జాతీయ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్రా లేదని స్పష్టం చేశా రు. వీటి అనుబంధ సంఘాలు బ్రిటీష్ వారికి సేవకులుగా పనిచేస్తూ ఎంతోమంది భూ పోరాట రైతుల మరణాలకు కారణమయ్యారని అన్నారు. అలాంటి వారు విమోచనం, విలీనదినం అంటూ ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించా రు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి దారులైన ఆదానీ, అంబా నీలకు దేశ సంపదను పంచి పెడ్తుందని ఆరోపిం చారు. వ్యాపారాల పేరుతో పేద ప్రజల చేతుల్లో ఉన్న అసైన్డ్, సీలింగ్, లావుణి భూములను లాక్కుని వారిని నిరాశ్రయు లను చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలం గాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మరోసారి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానా ఎర్రజెండా నీడలో భూపోరాటాలు నిర్వహించి అన్యాక్రాంతమైన భూ ములను స్వాధీనం చేసుకుని అర్హులైన పీడిత ప్రజలకు పంచిపెడ్తామని వారు హెచ్చరించారు. సమావేశం అనం తరం బైక్ ర్యాలీ మాడ్గుల మండలానికి తరలి వెళ్లింది. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు కే.నర్సిరెడ్డి, ఏ.రవికుమార్, ఆమనగల్ మండల కార్యదర్శి పిప్పళ్ళ శివ శంకర్, అరుణ్ కుమార్, తలకొండపల్లి మండల కార్యదర్శి గుమ్మడి కురుమయ్య, మండల కమిటీ సభ్యులు దుబ్బ చెన్నయ్య, కాన్గుల వెంకటయ్య, శివగల్ల రమేష్, పోలే నరసింహ, సభ్యులు దైవానందం, సాయిలు, చెన్నయ్య, పోచయ్య, జంగయ్య, పర్వతాలు, శ్రీను నాయక్, ఎల్లేష్, చరణ్, శంకర్, ప్రకాష్ కారత్, ప్రజానాట్యమండలి కళాకారులు వినోద్, గణేష్, భూషణ్ పాల్గొన్నారు.