Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా విద్యాధికారిని జి. రేణుకాదేవి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పాఠ్య ప్రణాళికలపై ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ అధికారులకు, మండల విద్యాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు రెండురోజుల శిక్షణా కార్య కమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి డీఈఓ రేణు కాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ టాంజేరిన్ ఆన్లైన్ యాప్ గురించి, తెలుగు, ఆం గ్లం, గణితం, ఈవీఎస్ అంశాలతో పాటుగా రాయాల్సిన పాఠ్యప్రణాళికలా గురించి అవగాహన కల్పించినట్టు తెలి పారు. స్వచ్ఛత పాఠశాల మున్నగు విషయాలపై సమగ్ర మైన చర్చతో కూడిన శిక్షణ అందించినట్టు తెలిపారు. 15వ తేదీన మండల స్థాయిలో ఎంఈఓలు, నోడల్ అధికా రులు ఆర్పీలకు, సీఆర్పీలకు శిక్షణ నిర్వహించాలని సూచించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రవి మాట్లాడుతూ 16వ తేదీ నుంచి మండలంలోని పాఠశాలలలో విధిగా మానిటరింగ్ నిర్వహించి ఎఫ్ఎల్ఎ న్లో భాగంగా విద్యార్థుల ప్రగతి ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. విద్యార్థుల ప్రగతిలో భాగస్వామ్యం అయ్యేలా ఉపాధ్యాయులకు ప్రోత్సాహం అందించి, వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చి వ్యవస్థను బలోపేతం చేస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైనాన్స్ అధికారి అనంతరెడ్డి, జిల్లా సెక్టోరియాల్ అధికారి జి. రవి , రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్ వీరేశం, నాగరాజు బెన్నూరి, జిల్లా రిసోర్స్ పర్సన్స్ విజయభాస్కర్ రెడ్డి, మీహిరచారి, రవి, ఆరిఫ్, అల్లాద్దీన్, ఖాజాపాషా, ఖాజామోనుద్దీన్, అన్ని మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు.