Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో జరుగు తున్న అభివద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సమస్యలపై వెంకటేశ్వర కాలనీ, నేతాజీనగర్‌లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికు లు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా బస్తీలలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, సీసీరోడ్ల సమస్యలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ బస్తీలో సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిధుల కొరత కారణంగా కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించ లేకపోతున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తక్షణం ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్, రావుల భాస్కర్, శ్రీకాంత్‌రెడ్డి, జోగి రవి, నరసింహ, నెలుట్ల జగన్, శ్రీకాంత్, శేఖర్, పండు యాదవ్, మజ్జార్, రామరావు, నాగేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.