Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల అధికారుతో సమావేశం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్స వాల''ను జిల్లాలో ఘనంగా నిర్వహించా లని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని స మావేశ మందిరంలో ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రో త్సవాల'' ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల'' ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో నియోజవర్గ స్థాయిలో మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. వికారాబాద్ నియోజ కవర్గంలో జిల్లా యువజన క్రీడల అధికారి, వికారాబాద్ డీఎస్పీను, పరిగి నియోజకవర్గంనకు డీఆర్డీఓ, పరిగి తహసీల్దార్, అదనపు ఎస్పీలను, తాండూర్ నియోజక వర్గంను గిరిజన సంక్షేమ శాఖ అధికారి, తాండూర్ ఆర్డీఓ, డీఎస్పీ, కొడంగల్ నియోజకవర్గంనకు జడ్పీ సీఈఓ, డి ప్యూటీ సీఈఓ, డీఎస్పీలను నోడల్ ఆఫీసర్లుగా నియమిం చినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 16న కలెక్టర్ కార్యాల యం నుంచి బ్లాక్ గ్రౌండ్స్ వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పరిగి నియోజకవర్గంలో కొడంగల్ ఎక్స్ రోడ్డు నుంచి మినీ స్టేడియం వరకు, తాండూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విలెమూన్ స్కూల్ వరకు అలాగే కొడంగల్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. 17న జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని, జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. పతాకావిష్కరణ తరువాత విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చే యాలన్నారు. 18వ తేదిన కలెక్టర్ కార్యాలయం లేదా అం బేద్కర్ భవనంలో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి అశోక్‌కుమార్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, జిల్లా గిరి జన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా యువజన , క్రీడల శాఖ అధికారి హన్మంత్ రావు, జిల్లా వైద్య అధికారి పాల్వాన్ కుమార్, వికారాబాద్ ఆర్డీఓ విజయకుమారి, జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీ డీఓలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.