Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2015 నుంచి మెస్ చార్జీలు పెంచని సర్కారు
- మూడు నెలలుగా అందని కాస్మోటిక్ చార్జీలు
- హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి
- ప్రతి హాస్టల్‌కూ వార్డెను నియమించాలి
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్
- వసతి గృహాల సందర్శన విద్యార్థుల సమస్యలపై ఆరా
నవతెలంగాణ-కొడంగల్
విపరీతంగా పెరిగిన ప్రస్తుత నిత్యవసర సరుకుల ధరలతో పాటు మెస్ చార్జీలు పెరగకపోవడంతో విద్యార్థుల కు పౌష్టికాహారం అందడం లేదని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్ అన్నారు. కొడంగల్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలి కల, బాలుర సంక్షేమ హాస్టలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలలో పెచ్చులు ఉడి పడుతున్నాయన్నారు, వర్షం పడితే రూములు కురవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. ఎస్సీ వసతిగృహంలో సాయంత్రం ఇవ్వాల్సిన స్నాక్స్ అందివ్వడం లేదన్నారు, హాస్టల్లకు ఏఎన్ ఎంలను నియమించాలన్నారు, విద్యార్థులకు అందించాల్సి న కాస్మోటిక్ చార్జీలు మూడు, నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నార న్నారు. వర్షాలు పడడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల వసతి గృహం ఎదుట బురదమయంగా మారడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలన్న ఇబ్బందిగా మారిందన్నారు. సంక్షేమ హాస్టల్లో మెస్ చార్జీలు పెంచి విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు ఏడేండ్ల నుంచి మెస్ ఛార్జీలు పెంచలేదన్నారు. మొదట్లో ప్రతిరోజూ గుడ్డు, అరటిపండు ఇచ్చేవారు, రాను రాను వీటిని తగ్గిస్తూ వస్తున్నారన్నారు.
విద్యార్థులకు కాస్మోట్ చార్జీలు పెంచడం లేదన్నారు. కాస్మోటిక్ చార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగక పోవడంతో సబ్బులు, ఆయిల్, టూత్ పేస్ట్, షాంపూలు, కట్టింగ్‌కు సరిపోవడం లేదన్నారు. మెనూ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు పోషకాహార లోపం బారిన పడతారన్నారు, బలమైన ఆహారం దొరకక వయసుకు తగ్గట్లు బరువు, ఎత్తు పెరగడం లేదని నివేదికలు చెబుతున్న పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక వ్యక్తి ఉదయం టిఫిన్ చేస్తే 60, 70 రూపాయలు అవుతుందని, మరి ఒక విద్యార్థి 36 రూపాయలలో మూడు పూటలా ఎలా పౌష్టికాహారం తీసుకోగలరో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు క్షవరానికి సరిపోతే ఇక సబ్బులు, తలనూనె, పేస్టు ఎలా కొనుకోవాలని ప్రశ్నించారు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇప్పటివరకు దుప్పట్లు అందలేదన్నారు. సంక్షేమ హాస్టల్ పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి హాస్టల్స్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు సంక్షేమ హాస్టలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బాలికల వసతి గృహానికి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌కూ వార్డెను నియమించాలన్నారు. ఎస్సీ హాస్టల్లో మూత్రశాలల పక్కన శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించాలన్నారు, హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు వెంకట్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.