Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద బీజేపీ కుట్రలు పసిగట్టాలి
- తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి ఏం ఏమిటి సంబంధం?
- తప్పుడు ప్రచారాలను తిప్పి కొడతాం
- బీజేపీ ఆటలు సాగనివ్వం
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ
నవతెలంగాణ - మాడ్గుల
దేశంలో బీజేపీ పాలన నాటి బ్రిటిష్, నైజాం పాలన కంటే ప్రమాదకరంగా మారిందని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ మండలంలోని చంద్రాయన్పల్లి, కలకొండ, ఇర్విన్, బ్రాహ్మణపల్లి, మాడుగుల, నాగిళ్ల గ్రామాలలో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రధాన కూడలిల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. భూస్వాములకు, జమీందారులకు, పీడిత ప్రజలకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని రెండు వర్గాల మధ్య పోరాటంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నీతిమాలిన కుట్లను ప్రతి ఒక్కరూ పసిగట్టి తిప్పి కొట్టాలని సూచించారు. సోయబుల్లా ఖాన్, ముగ్దుం, వంటి ఎందరో ముస్లింలు ఈ వీరోచిత పోరాటంలో అసు వులు బాసినట్టు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగే రోజుల్లో బీజేపీ పుట్టలేదని, దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ ఉన్న సాయుధ పోరాటం, స్వతం త్ర పోరాటంలో పాల్గొనలేదని అన్నారు. తప్పుడు ప్రచారా లను మానుకోవాలని, ఇక మతోన్మాద బీజేపీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. దేశంలో పసిపాప పాల నుంచి పండు ముసలి అయి చనిపోయిన తర్వాత కూడా శ్మశానంలో కాల్చడానికి పన్నులు వేస్తూ నాటి బ్రిటిష్ నైజాం పాలన కంటే కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పన్ను లు విధిస్తూ అధ్వానంగా దోచుకుంటుందని అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రయివేటు పరం చేస్తూ దేశాన్ని అంతా అమ్మేస్తున్నారని దేశ ప్రజలంతా ఆలో చించాలని కోరారు. ఎర్రజెండా నాయకత్వంలో దౌర్జన్యా లు, దోపిడీ, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేల ఎకరాల భూములు పేదలకు పంచిన ఘనత కమ్యూని స్టులదే అని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బోడ సామెల్, కందుకూరి జగన్ అన్నారు. నాటి సాయుధ పోరాట ఫలి తంగానే కౌలుదార్ చట్టం, భూసంస్కరణ చట్టాలతో ఎం తోమంది పేదలకు మేలు జరిగిందని అన్నారు. బీజేపీ ఇప్పటివరకు కులాలు, మతాలు వర్గాల మధ్య విద్వేషాలు, అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది తప్పా పేదలకు అవసరమైన ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు. ప్రమాదకర బీజేపీని ఓడించేందుకు ప్రతి ఒ క్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జి ల్లా కార్యవర్గ సభ్యులు సామేల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్, నర్సిరెడ్డి, రాజు, మాడుగుల మండలం కార్యదర్శి ఈర్ల నరసింహ, మండల కమిటీ సభ్యులు పులికంటి రమే ష్, పందుల నరసింహగౌడ్, పులికంటి శేఖర్, పందుల శీను, సుగురు శీను, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎండి ముస్తఫా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.