Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ-మంచాల
ఐక్య ఉద్యమాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆగపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల యూనియన్ మూడోవ మహాసభలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారనే గ్రామ పంచాయతీ కార్మికుల కు పెరిగిన వేతనాల జీవో వచ్చిందన్నారు. గ్రామ పంచాయతీల్లో నేటికి సమస్యలు ఉన్నాయనీ, ఆ సమస్యలు పరిష్కారానికి కార్మికులందరూ ఐక్యమై, ఉద్యమించాలన్నారు. జీవో 51నీ సవరించి ప్రతి కార్మికుడికీ రూ. 8500 వేతనం ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయ వంతంలో గ్రామ పంచాయతీ కార్మికుల కీలక పాత్ర పోషించారని గుర్తు చేవారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెం టనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియేడల పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల యూనియన్ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ మండల కమిటీలో అధ్యక్షులు శంకరయ్య, అధ్యక్షులుగా ఖాజా పాషా, కార్యదర్శిగా దూసరి భాస్కర్, కోశాధికారిగా బి.శంకరయ్య, ఉపాధ్యక్షులుగా ఎ.రవి, సురేష్, జంగయ్య, సహాయ కార్యదర్శిగా జీ.సురేష్, కే.జగన్, దేవదాస్లను ఎన్నుకున్నట్టు తెలిపారు. వీరితో పాటు మరో 25 మందితో మండల కమిటీని ఎన్నుకున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి పోచమొని కృష్ణ, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గ్యార పాండు తదితరులు ఉన్నారు.