Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి...
నవతెలంగాణ-మియాపూర్
గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణీ దారుణహత్యకు గురైన ఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతి(32)తో కలిసి నగరానికి వచ్చి ఓ ఐటీ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి కొండాపూర్ బీఆర్ టవర్స్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి చైత్ర అనే పదేళ్ల కుమార్తె ఉంది. భార్య స్రవంతి ప్రస్తుతం 8 నెలల గర్భిణి. వెంకట రామకృష్ణ తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీప్రసన్న వివాహం 2020లో శ్రీరామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించాడు. వీరి కాపురం కొంతకాలంపాటు సజావుగా సాగిన కాపురంలో కలహాలు వచ్చాయి. అదనపు కట్నం తీసుకరావలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పుట్టింటివారికి లక్ష్మిప్రసన్న విషయం తెలియజేసింది. వెంకటరామకృష్ణ పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గతేడాది శ్రీరామకృష్ణ గ్రామానికి వెళ్లి అక్కడ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. చర్చలు విఫలం కావడంతో లక్ష్మిప్రసన్న చందానగర్‌లో పుట్టింటి దగ్గర ఉంటూ ఉద్యోగం చేస్తుంది. ఇదే క్రమంలో నెల క్రితం అత్తింటివారు, భర్తపై చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీరామకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. గ్రామానికి వచ్చి తమ పరువు తీశారని, ఇదంతా వెంకటరామకృష్ణ దంపతులు చేయిస్తున్నారని వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల నగరానికి చేరుకుని అతడిని హత్య చేసేందుకు ఎర్రగడ్డలోని వేటకొడవలిని కొనుగోలు చేశాడు. ఈ నెల 6న తన కారులో కొండాపూర్‌లో ఉంటున్న వెంకటరామకృష్ణ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో తన కూతురిని స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి రామకృష్ణ చేతిలో ఉన్న వేటకొడవలిని చూసి కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో శ్రీరామకృష్ణ వేట కొడవలితో ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం, భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పక్కవారు గమనించి ఆమెను ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి 11 గంటలకు మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆమెను అపార్టుమెంట్లో లభించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడిని మరుసటి రోజు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.