Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి కౌన్సిలర్ల ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ కౌన్సిలర్లు బానుబాబుగౌడ్, రమేష్, సుజాత, సుదాకర్, మమత, ఆకుల యాదగిరి, ప్రసన్నలకిë, జ్యోతి, బాలరాజ్, పద్మ, శ్రీలత, స్వేత, మంగ, బర్తాకి జగన్ కలిసి మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేశారు. చైర్ పర్సన్ అవినీతికి పాల్పడిందని గత కొంత కాలంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా చైర్ పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. లేకుంటే పార్టీ పదవులతోపాటూ, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూడా మంత్రి వెంటే ఉన్నారు.