Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను విరమించుకోవాలి
వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు కాళ్ల జంగయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరుగుజ్జు వికలాంగులను అవమాన పరుస్తూ చేసిన అనుచిత వ్యాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ల జంగయ్య డిమాండ్ చేశారు. వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాక్యలు బాధకరమన్నారు. వికలాం గులను సమాజంలో అందరిలాగే సమానంగా చూసుకోవల్సిన తరు ణంలో మరుగుజ్జు వికలాంగులను అవమానించడం సరైంది కాద న్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హౌదాలో ఉన్న వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే వికాలాంగులకు రక్షణ ఎక్కుడ ఉంటుందని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్, తెలంగాణ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్టిరాజు, ఎమార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జుట్టు సతీష్ మాదిగ, జిల్లా నాయకులు యాచారం జంగయ్య, గువ్వల యాదయ్య, మద్దెల బాలరాజు, కరంటోత్ శ్రీనివాస్, మరుగుజ్జుల సంఘం రాష్ట్ర నాయకులు చీమల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.