Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
- అధికారుల సమీక్షా సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఇబ్ర హీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సే క్యాంపు కార్యాలయంలో వజ్రోత్సవాల నోడల్ అధికారి వెంకటాచారితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న వజ్రోత్సవాల వేడుకలను దిగ్విజయం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రభు త్వం కార్యక్రమాలు రూపొందించిందని చెప్పారు. 16న నియోజకవర్గ కేంద్రంలో పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. 17న జాతీయ జెండాల ఆవిష్కారణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. 16న ఇబ్రహీంపట్నం పాత బస్టాండు నుంచి క్యాంపు కార్యాలయం గ్రౌడ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు , మహిళలు అన్ని శాఖల అధికారులు పాల్గొనే విధంగా సమీకరణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నిజాం సంస్థానం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన చరిత్ర, నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటి తరానికి తెలపడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే వివరించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఉమామహేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు రామాంజులురెడ్డి, జ్యోతి, అమరేందర్ రెడ్డి, యూసుఫ్, తహసీల్దార్లు రామ్మోహన్, అనిత, సుచరిత, అనితారెడ్డి, ఎంపీడీఓలు మమతాబాయి, శ్రీనివాస్, విజయలకిë, విజరు, ఏఎంసీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ ఆకుల యాదగిరి, మాజీ జెడ్పీటీసీ కర్నాటి రమేష్ క్రౌడ్, నాయకులు చిలుకల బుగ్గురాములు, చీరాల రమేష్, జెర్కోనిరాజు పాల్గొన్నారు.