Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్ నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కందుకూరు మండల పరిషత్ మీటింగ్ హాలులో హెచ్ఆర్సీ కొమ్ము తిరుపతి ఆధ్వర్యంలో కందుకూర్, మహేశ్వరం ,శంషాబాద్, రాజేం ద్రనగర్ ,బాలాపూర్ ,మండలాల ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు. బాలల హక్కులపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యా ర్థులకు, విద్యాబోధనతో పాటు బాలల హక్కులు బాధ్యతలు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ సోడా బత్తిని అంబేద్కర్, సీడబ్ల్యూసి సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ జి. రమాదేవి, సభ్యులు ఉమాదేవి, ఎంఈఓ కృష్ణయ్య, ఎంపీడీవో వెంకట రాములు, పోరా జిల్లా కోఆర్డినేటర్ పి శ్రీలత, కే. స్వప్న, వాలంటీర్స్ దుర్గా, మాధవి, పాల్గొన్నారు.