Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి. కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పేదల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు.ఉప్పరిగూడలో మంజూరైన 186 ఆసరా పింఛన్ల కార్డులను లబ్దిదారులకు బుధవారం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్ర మాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లను పెంచిన ప్రభుత్వం తాజాగా కొత్త వారికి కార్డులను అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ జయరాం విజరు, ఉప్పరిగూడ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి, ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి, వార్డు మెంబర్ మడుపు అనిత, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నల్లోల్ల రమేష్, బోసుపల్లి హరికృష్ణ, పంచాయతీ కార్యదర్శి రుషిక నేత ఉన్నారు.