Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల సాధికరతకు కృషి చేయాలి
- జిల్లా అధికారులకు ఆదేశాలు
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతి నిధులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామీణా భివృద్ధి సంస్థ, మెప్మా అధికారులను ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘా లకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను తప్పనిసరిగా భాగ స్వామ్యం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, ఇది సరైన పద్ధతి కాదనీ, ప్రజా ప్రతినిధులను విధిగా భాగస్వామ్యం చేయాలన్నారు. తద్వారా వారు మహిళా సంఘాల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి వివరిస్తూ మహిళలకు మరింత అవగాహన పెంపొందింపజేసేందుకు అవకాశం ఉంటుం దన్నారు. ఇక నుంచి ప్రభుత్వ పరంగా చేపట్టే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా ప్రజాప్రతినిధులకు ముందస్తుగానే తెలియజేయాలని, వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని, భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సిద్దించగా, తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిం దన్నారు. ఇది జరిగిన 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరుగు తుందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రో త్సవాల వేడుకలలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
16వ తేదీన అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన మీదట, బహిరంగ సభలో వజ్రో త్సవాల ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్ర ప్రాము ఖ్యత గురించి వక్తలు వివరిస్తారని తెలిపారు. 17న హైదరాబాద్ లోని బంజారా హీల్స్ రోడ్డు నెం.10 లో రెండు ఎకరాలలో రూ.53 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కొమరం భీమ్ భవనం, సేవాలాల్ బంజారా భవనలను సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని, అనంతరం యన్.టి.ఆర్. స్టేడియంలో బహిరంగ సభలో సందేశం ఇస్తారని తెలిపారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఎస్టీలను బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలించాలని తెలిపారు. సెప్టెం బర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్ష్షా సమావేశంలో శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక జైన్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.