Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులకు తీవ్రగాయాలు
నవతెలంగాణ-కందుకూరు
ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టుకు ఢకొీనడంతో డ్రైవర్, కండక్టర్ తో సహా పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కందుకూరు సీఐ కృష్ణరాజు తెలిపిన వివరాలు ప్రకారం అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అచ్చంపేట డిపో నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది.అచ్చంపేట నుంచి హైదరాబాదుకు అతివేగంగా, అజాగ్రత్తగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గబడగూడ గేటు, మయూరి పైపులైను కంపెనీ దగ్గర, ఎదురుగా వస్తున్న కోళ్ల వ్యాను, దాని వెనకాల వస్తున్న మరొక గూడ్స్ వాహనాన్ని ఢ కొట్టగా , బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న వేప చెట్టు ఢకొీట్టింది. దీంతో డ్రైవర్ దేవస్వామికి, కండక్టర్ రాజేందర్‌తో పాటు, బస్సులో ప్రయాణిస్తున్న సుమారు పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ. కొండల ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.