Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దల అండతో నిరుపేదల భూముల కొట్టేయాలని యత్నం
మధురనగర్ కాలనీ ప్లాట్ అసోసియేషన్ కమిటీ అధ్వర్యంలో జిల్లా ఏవోకు వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పెద్దల అండతో బడా పారిశ్రామికవేత్తలు నిరుపేదల భూముల కొట్టేయాలని చూస్తున్నారని, పేదల భూములు కాపాడాలని మధుర నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆబ్దుల్లాపూర్ మెట్టు మండలం తట్టి అన్నారం రెవెన్యూ గ్రామం మధుర నగర్ కాలనీ ప్లాట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎవోకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ముందర బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తట్టి అన్నారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్లు 108, 109, 110, 111 లోని 70 ఎకరాల 39 గుంటల భూమి పట్టాదారు అయిన మద్ది సత్యనారాయణ రెడ్డి 1982లో దాదాపు 840 ప్లాట్లతో వెంచర్ చేసి ప్లాట్లను అమ్మకం చేయడం జరిగిందన్నారు. ఈ భూమిని అధికారులతో కలిసి కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించు కోవాలని చూస్తున్నారన్నారని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. భూమిని ఆక్రమించుకోవడానికి సహకారం అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధురా నగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిథులు సిహెచ్ సత్యనారాయణ, అంజనేయులు, పి. నరసింహ రెడ్డి, ముద్దగౌని రంజీత్ గౌడ్, మనీష్ గౌడ్, అమరా రెడ్డి, సమద్, రాజశేఖర్ రెడ్డి, సంజరు, సతీశ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, సునీల్ సాగర్, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులున్నారు.