Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
గోపులారం పాఠశాలలో జాతీయ హిందీ భాషా దినోత్సవం ఉపాధ్యా యులు, విద్యార్థులతో కలిసి బుధవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత పాపగారి ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటూ, జాతీయ భాష హిందీని కూడా నేర్చుకోవాలని సూచించారు. భారత జాతీ యోద్యమంలో అఖిలభారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు ఆనాడు దోహదపడిన గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగంలోని 351వ ఆధికరణం ఎనిమిదోవ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా పొందు పరిచినట్టు గుర్తు చేశారు.అనంతరం హిందీ ఉపాధ్యాయురాలు సావిత్రిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణశాస్త్రి, విజయలక్ష్మి , విద్యార్థులు ఉన్నారు.