Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చైర్ పర్సన్ ఛాంబర్లో ఉత్సవాలు
- ముఖ్యమంత్రి, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మున్పిపల్ స్వల్ప చట్ట సవరణ బిల్లు తేవడం పట్ల తెలంగాణ రాష్ట్ర చైర్ పర్సన్స్ ఛాంబర్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు వెన్ రెడ్డి రాజు, రాష్ట్ర కార్యదర్శి కప్పరి స్రవంతి చందు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. చైర్మెన్లపై మూడేండ్లకు ఆవిశ్వాసం పెట్టే దాన్ని నాలుగేండ్లకు పెంచడం అభినందనీయమన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేసినందుకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేశారు, మున్సిపాలిటీల అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గెలుపునకు ప్రతి మున్సిపాలిటీ చైర్మెన్లు కృషి చేస్తుందని తెలిపారు.