Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాచారం మండల కేంద్రంలో విద్యార్థుల ర్యాలీ
- పాల్గొన్న ఎంపీపీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది
నవతెలంగాణ-యాచారం
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని యాచారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, విద్యార్థులతో బుధవారం ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. మండల వ్యాప్తంగా 2-19 ఏండ్లు ఉన్న 18,200 మంది పిల్లలు ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో పోషకారులోపం, రక్తహీనత, ఎప్పుడు అలసటగా ఉంటారనీ, శారీరక, మానసిక అభివృద్ధిలో లోపం కనిపిస్తుందన్నారు. నేడు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నూలి పురుగుల నివారణ మందులు వేయించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.