Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ యువజన విభాగం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు గుడుపల్లి పెంటారెడ్డి
నవతెలంగాణ-షాబాద్
అర్హులైన లబ్దిదారులందరికీ ఆసరా పింఛన్లు పంపిణీ చేయాలని కాంగ్రెస్ యువజన విభాగం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు గుండుపల్లి పెంటారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన షాబాద్ మండల కేంద్రంలో విలే కరులతో ఆయన మాట్లాడుతూ తూతూమంత్రంగా కొంతమందికే ఆసరా పింఛన్లు పంపిణీ చేసి, ప్రభుత్వం చేతులు దులుపు కుంటుందన్నారు. గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులకు పింఛన్లు కోసం నేటికి ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చి అర్హులైన ప్రతి ఒక్కరికీ అసరా పింఛ న్లు అందేలా కృషి చేయాలని ప్రభు త్వాన్ని కోరారు. లేని పక్షంలో గ్రామాల్లో ఆందోళన కార్య క్రమం చేపడ తామని హెచ్చ రించారు.