Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-షాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలో స్టార్ గార్డెన్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయడంతో, బంగారు తెలంగాణగా మార్చడంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ పొన్న స్వప్ననర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మీరాజేందర్గౌడ్, సీఏసీఎస్ చైర్మెన్ శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ మల్లేష్, కో-ఆప్షన్ మెంబర్ చాంద్‌పాష, ఎంపీడీవో అనురాధ, పార్టీ మండలాధ్యక్షలు నర్సింగ్‌రావు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, నర్సింహారెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, మల్లిఖార్జున్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.