Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని జలమండలి అధికారులు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గానగర్‌లో గత వారం రోజులుగా తాగునీటి సరఫరాలో కలుషిత జలాలు కలిసి వస్తున్నాయి. డ్రయినేజీ మురుగునీరు తాగునీటి పైపులైన్లు కలవడంతో కాలనీ మొత్తం మురుగు నీరు సరఫరా అవుతుంది. దీంతో గత వారం రోజులుగా కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నీరు తాగుదామంటే పూర్తిగా దుర్వాసన, తాగడానికి నీరు వేరే ప్రాంతం నుంచి తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఆ నీరు తాగి అనారోగ్యం పాలయ్యారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఈ మురుగు నీరు సరఫరా వలన ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.గత వారం రోజులుగా జలమండలి అధికారులకు సమస్య విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వలన ప్రజలు మురుగు నీరు తాగి అనారోగ్యం పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైలార్‌దేవ్‌పల్లిలోని జలమండలి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ అధికారి తమ కాలనీవైపు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ కలుషిత జలాల సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.