Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధ వారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా జాతీయ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిలో భాగంగా, 16న జరిగే ర్యాలీ, సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ, 16న జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని, స్థానిక ఎమ్మెల్యేలతో సమ న్వయం చేసుకుని ర్యాలీ విజయవంతం చేస్తామని తెలిపారు. ర్యాలీ అనంతరం భోజనం ఏర్పాటు కోసం అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన బ్యారీకేడ్లు ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 17న జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని, జిల్లా నుంచి 13 వేల 500 మంది ఎస్టీలను బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలిస్తున్నామని, వారికి అవసరమైన తాగునీరు, భోజన సౌకర్యాలు చేసి, సకాలంలో హైదరాబాద్ చేరే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ సుందరికరణ పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, పీడీ డీఆర్డీఏ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పోలీస్ అధికారులు, రోడ్లు భవనాలు ఈఈ శ్రవణ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.