Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని వినోబానగర్లో రూ. 2.05 కోట్లతో నిర్మించిన కేజీబీవీ కళాశాల, పాఠశాల నూతన భవనాన్ని స్థానిక స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, విద్యాధికారి సుశీందర్రావు, జేడి రమేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలలు, కస్తూర్బా నిల యాల్లో సకల వసతులు కల్పించి, విద్యా ర్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహి స్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా విద్యార్థులు రెండు, మూడు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవ మేనన్నారు. ప్రస్తుతం కొత్త భవనంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండబోవని స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలలో అందిస్తున్న భోజనంపై ప్రభుత్వం ఎక్కడ రాజీపడబోదని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గురు కులాల్లో సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయని తెలి పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొ న్నారు. గురుకులాల్లో బాలికల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంలో ఉన్న పాఠశాల ప్రత్యేక అధికారి తీరుతో విద్యార్థులు కొంతమేర ఇబ్బంది పడ్డారని ప్రత్యేక అధికారితో పాటు మరో ఉపాధ్యా యురాలను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు. పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుటే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దృష్టకి తీసుకురావాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రుల, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, ఎంపీపీ పి.కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, వైస్ చైర్మెన్ ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రామ్మోహన్, ఏఎంసీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణ రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి, కేజీబీవీ పాఠశాల ఇన్చార్జి భార్గవి, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు జెర్కోని రాజు పాల్గొన్నారు.