Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ- కొత్తూరు
రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. గురువారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని రాధా గార్డెన్లో నూతనంగా మంజూరైన ఆస రా పెన్షన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సం దర్భంగా సిద్దాపూర్, వైఎం తాండ, ఎస్బిపల్లి, కోడిచెర్ల, కో డిచెర్ల తాండ, ఇముల్ నర్వ, పెంజర్ల గ్రామాలకు చెందిన 354 ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాలలో అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్ కార్డులు రానివారు నిరుత్సా హా పడాల్సిన అవసరం లేదని త్వరలో అర్హులైన వారం దరికీ అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, జడ్పిటిసి ఎమ్మే శ్రీలత సత్యనా రాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, వైస్ ఎంపీపీ శోభా లింగం నాయక్, సర్పంచులు మామిడి వ సుంధరమ్మ, వెంకట్ రెడ్డి, సత్తయ్య, వడ్డే తులసమ్మ బాల య్య, రవి నాయక్, అంబటి ప్రభాకర్, అజరు నాయక్, ఎంపీటీసీలు రవీందర్ రెడ్డి, దేశాల అంజమ్మ, ఎర్రవల్లి ప్ర సన్న, జంగ గళ్ళ కృష్ణయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, నాయకులు ఎమ్మే సత్యనారాయణ, పెంట నోళ్ళ యాదగిరి, వడ్డే బాలయ్య, మిట్టూ నాయక్, లింగం నాయక్, కడల శ్రీశైలం, చిర్ర మధుసూదన్ రావు, బి రాజు, సిరాజ్, వడ్డే మహేష్, ఎంపీడీవో శరత్ చంద్రబాబు, ఎంపీఓ నరసింహ, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.