Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకో వాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు అన్నారు. గురువా రం సంఘం లక్ష్మీబాయి పాఠశాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంఘం లక్ష్మీబాయి బాగా చదువుకొని సమాజంలో సంఘ సంస్కరణలు గావించడంతోపాటు రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగారని కలెక్టర్ తెలిపారు. పిల్ల లందరూ ఉన్నతంగా చదివి మంచి స్థాయిలో ఎదగాలని కలెక్టర్ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మురుగు కాలువల నీటి నిల్వలతో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కార కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. ప్రహరీ పెంపునకు, పాఠశాల ఆవరణలో సోలార్ వీధి దీపాల ఏర్పాటుకై స్థలా న్ని గుర్తించి తెలపాలని మండల విద్యాశాఖ అధికారికి ఆదే శించారు. విద్యార్థినిల సౌకర్యార్థం డార్మెటరీ, పాఠశాల మరమ్మతులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలని ఎంఈఓకు సూచించారు. 'మన ఊరు మనబడి కార్య క్రమం' కింద పాఠశాలను చేర్చి అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలకు ఏజెన్సీ ద్వారా వాటర్ హీటర్‌కు సంబంధించి అంచనాలను అందజేసినట్లయితే సామర్థ్యం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువు తోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనా లన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమణమ్మ, ఎంఈఓ బాబుసింగ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.