Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
నిరుపేదల అభివృద్ధే ప్రభత్వ ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం, గాజుల గూడా, లక్ష్మారెడ్డి గూడా, రావులపల్లి, అలంకాని గూడ, చందిప్ప, ఎలవర్తి గ్రామాలకు చెందిన లబ్దిదారులకు నూతన ఆసరా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని,అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, వారి అభివృద్ధికి తొడ్పతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కు తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, రావులపల్లి సర్పంచ్ పావని హనుమంత్ రెడ్డి, ఉప సర్పంచ్ కౌకుంట్ల బుచ్చిరెడ్డి, లక్ష్మారెడ్డిగుడా సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, గాజుల గూడా సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ నసీర్, మహాలింగాపురం సర్పంచ్ మాణిక్య రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, అలంకానికూడా సర్పంచ్ మౌనిక నరేందర్‌రెడ్డి, చందిప్ప సర్పంచ్ సీహెచ్ స్వప్న మోహన్, కో-ఆప్షన్ సభ్యులు నయుం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కావలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా, ఎంపీఓ గీత, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు, లబ్దిదారులు ఉన్నారు.