Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి
- నాల్గొవ రోజుకు చేరుకున్న రైతుల రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ-యాచారం
ఓంకారేశ్వర ఆలయం పేరును తొలగించి తరతరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి, తాడిపర్తి, సింగారం, కుర్మిద్ద గ్రామాల రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నాల్గో రోజుకు చేరు కుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు గ్రామాల రైతులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజా ప్రతినిధులు స్పందిం చకపోవడం దురదృష్టకరమన్నారు. 1400 ఎకరాల సాగు భూమిని కొంతమంది స్వార్థపరులు పేద రైతులకు చెందకుండా ఆలయం పేరుపై రాయడం సరైంది కాదని విమర్శించారు. 37/ఏ ప్రకారం రైతులందరికీ సర్టిఫికెట్లు ఉన్న కూడా ప్రభుత్వ అధి కారులు, ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. నాలుగు గ్రామాల రైతులకు ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు ఇవ్వకుంటే ప్రజా సంఘాలను కూడా గట్టి అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మండల పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య, బాధిత రైతులు జే రాములు, ఎం జంగయ్య, జంగారెడ్డి, కే జంగయ్య, ఝాన్సీ, జ్యోతి, పెద్ద వెంకయ్య, బి మల్లయ్య, శ్రీశైలం, శ్రీరాములు, జంగయ్య, బుగ్గమ్మ, పద్మమ్మ, కొమురమ్మ తదితరులు పాల్గొన్నారు.