Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
ఆల్బెండజోల్ మాత్రల ద్వారా నులి పురుగులను నివా రించవచ్చని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. గురువారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా కొత్తగడిలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నులి పురుగులు ఏర్పడడంతో పోషకాహార లోపం రక్తహీనతతో అలసటగా ఉంటుందన్నారు. పిల్లలు ఎప్పుడూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు గోర్లను ఎప్పటిక ప్పు డు కత్తిరించుకోవాలని కలెక్టర్ సూచించారు. పరిసర ప్రాం తాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాల ని కలెక్టర్ తెలిపారు. నులిపురు గులు ఉండడం వలన తీసుకున్న ఆహారాన్ని పురుగులు తీసుకోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారన్నారు. విద్యార్థినులకు ఆల్బెండ జోల్ మాత్రలను కలెక్టర్ స్వయంగా వేశారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, పాఠశా ల ప్రిన్సిపల్ అపర్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పలాన్ కుమార్, డిప్యూటీ డిఎం హెచ్ఓ జీవరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.