Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసిన
- మండల మహిళా అధ్యక్షురాలు ఇంద్రమ్మ, గ్రామసంఘం వీఓఏలు
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామ సంఘాలకు డ్వాక్రా భవనం నిర్మించాలనీ మండల మహిళా అధ్యక్షు రాలు ఇంద్రమ్మ, గ్రామ సంఘం వీఓఏలు అందరు కలిసి సర్పంచ్ సత్యమ్మ నర్సింలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..25 ఏండ్ల నుండి కిష్టాపూర్‌లో గ్రామ సంఘాలు నడుస్తున్నాయనీ, డ్వాక్రా భవనం లేనందువలన కిష్టాపూర్‌లో డ్వాక్రా భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. గతంలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ కి రాతపూర్వకంగా అందజేశామని కచ్చితంగా మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి 2 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ మంజూరు చేయలేదన్నారు. గ్రామంలో 60 మహిళల సంఘాల గ్రూపులున్నాయనీ, సమావేశాల నిర్వహించిన ప్రతీసారి చెట్ల కింద, గ్రామపం చాయతీ బయట మీటింగులు పెట్టుకుంటున్నామనీ వారు వాపోయారు. ఎమ్మెల్యే, జడ్పీటీసీ డ్వాక్రా భవనం మంజూరు చేయించి నిర్మించాలని కిష్టాపూర్ గ్రామ సంఘల సభ్యులు, దోమ మండల మహిళా అధ్యక్షురాలు ఇంద్రమ్మ, వీఓఏలు కోరుతున్నారు.