Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సోమారపురవి
నవతెలంగాణ-మోమిన్ పేట
మోమిన్‌పేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలుర గురుకుల వసతి గహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సం దర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలు ప్రారం భమై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ దుస్తులు, బూట్లు, నేటికి ఇవ్వలేదన్నారు. వసతిగృహంలో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డ్రయినేజీ సదుపాయం సక్రమం గా లేకపోవడంతో అనారోగ్యాలకు గురయ్యేప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గు ర్తించి కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెన్నులు, పెన్సిల్లు, సబ్బు లు, పెస్టు ఇచ్చామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వసతి గృహంలో విద్యార్థుల ఎదుర్కొంటున్నా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సురేష,్ నరసిం హులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.